జీలుగుమిల్లి :రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు జీలుగుమిల్లి ఎస్ఐ ఈ చంద్రశేఖర్ చెప్పారు. ఆయన కథనం ప్రకారం జీలుగుమిల్లి శివారు రమణక్క పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్ పై ఎదురెదురుగా ఢీకొనడంతో సంఘటన లో రాయల జరపాలు అక్కడికక్కడే మృతి మరో వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా సాయి సిక్స్త్ పొందుతి మృతి చెందినట్లు చెప్పారు. గురువారం రాత్రి జరిగిన సంఘటన లో టి. నరసాపురం మండలంలోని బండి వారి గూడెం గ్రామానికి చెందిన రాయల జలపాలు జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం చెందిన వసంత వాడ సాయి జాతీయ రహదారిపై బైకులపై ఎదురు ఎదురుగా వస్తూ ఢీకొన్నట్లు అని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇరువురి బైకులు నుజ్జునుజ్జినైనట్లు చెప్పారు. ఈ సంఘటనలో ఇరువురి వ్యక్తులు మృతి చెందినట్లు చెప్పారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే జాతీయ రహదారి పైన పలు ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పలు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అతివేగం ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారమని అని చెప్పారు.

