ముగ్గురు వ్యక్తుల నుండి 2.2 లక్షల రూపాయలు స్వాధీనం
కామవరపుకోట :రోజురోజుకు జమ ఖర్చు లేని డబ్బులు పట్టుబడుతున్నాయి.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల నుండి 2.2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ తెలిపారు. ఏలూరు కు చెందిన వ్యక్తి నుండి 52,900, కామవరపుకోటకు చెందిన వ్యక్తి నుండి 86,400, పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 62,700 రూపాయలు వారి వాహనాలలో జరిపిన సోదాలలో దొరికినాయి. ఈ సొమ్మును స్థానిక తహసిల్దార్ జేవిఆర్ రమేష్, తడికలపూడి ఎస్సై జయ బాబు ల ఆధ్వర్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సత్యవేణికి అందజేశారు. ఈ నగదు ను ఏలూరు ట్రెజరీ ఎన్నికల అధికారికి తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదు గల వ్యక్తులకు అందజేయనున్నట్లు ఎన్నికల చెక్ పోస్ట్ అధికారి మొహిద్దిన్ తెలిపారు. ఈ తనిఖీలలో చెక్పోస్ట్ పోలీసు సిబ్బంది కే రామకృష్ణ,జి సూర్యరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామి, నాగార్జున, షేక్ నాగూర్ సాహెబ్, ఎలక్షన్ ఫోటోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు.