Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలురొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి

రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి

అయ్యా దత్తపుత్రా… ఇలా భార్యలను మార్చేస్తే అక్కచెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలి?

భీమవరం:-
రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పని చెయ్యకపోయినా.. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని ఎల్లో మీడియాలో ప్రచారంతో ఊదరగొడుతున్నారని విమర్శించారు. భీమవరం సభలో సీఎం జగన్ సెటైర్లు వేశారు.రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పని చెయ్యకపోయినా.. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని ఎల్లో మీడియాలో ప్రచారంతో ఊదరగొడుతున్నారని విమర్శించారు.. సీఎం జగన్‌ బస్సు యాత్ర 16వ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం భీమవరం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై విమర్శలు చేశారు.మోసాలు, పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. నాపై ఎక్కుపెట్టిన బాణాలన్నీ సంక్షేమ పథకాలకు తగులుతాయన్నారు. చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువని, నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబును ఆ ప్రశ్న అడిగినందుకే నాపై కోపం పెంచుకున్నారన్నారు. ప్రజలను మోసం చేస్తూ ఎందుకు నటిస్తున్నావని చంద్రబాబును అడిగానన్నారు.నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు పవన్ కల్యాణ్ భార్యలను మారుస్తున్నారని సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఇప్పుడు నియోజకవర్గాలను కూడా అలవోకగా మారుస్తున్నారన్నారు. ఇదేం న్యాయమని అడిగితే పవన్ కు ఈ మధ్య బీపీ వచ్చి ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అభివృద్ధికి అసలు సంబంధమే లేదని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతో రాజకీయాలు చేస్తున్నారని, వీటి గురించి అడిగినందుకు బాబుకు, దత్తపుత్రికిడి, చంద్రబాబు వదినకు కోపం వస్తుందన్నారు.
విపక్ష నేత చంద్రబాబుపైనా, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తనపై చాలా కోపం ఉందని, తన గురించి మాట్లాడే సమయంలో ఆయనకు హైబీపీ వస్తుంటుందని అన్నారు. నాకు ఏదో అవ్వాలని శాపాలు పెడుతుంటాడని, రాళ్లు విసరాలని పిలుపునిస్తుంటాడని వెల్లడించారు. నీ పేరు చెబితే గుర్తుకు వచ్చే మంచి పథకం ఒక్కటైనా ఉందా అని చంద్రబాబును అడిగా… అందుకే నాపై ఆయనకు కోపం… చెరువులో కొంగ మాదిరిగా ఎందుకు జపం చేస్తావు అని అడగకూడని ప్రశ్న అడిగా… అందుకే ఆయనకు నాపై కోపం అని సీఎం జగన్ వివరించారు.చంద్రబాబు అంటే గుర్తుకువచ్చేవి వెన్నుపోటు, మోసం, దగా, కుట్రలు, అబద్ధాలు అని విమర్శించారు . దత్తపుత్రుడు కూడా అంతే. అతడిలోనూ బీపీ బాగా కనిపిస్తోంది. దత్తపుత్రా, దత్తపుత్రా… పెళ్లికి ముందు పవిత్ర హామీలు ఇచ్చి, పిల్లల్ని కని, నాలుగైదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను, భార్యలను మార్చినట్టు నియోజకవర్గాలను అలవోకగా మార్చేస్తున్నావు… ఏం మనిషివయ్యా నువ్వు? అని అడిగా. అయ్యా దత్తపుత్రా… ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు. .. పదే పదే చేస్తుంటే దాన్ని అలవాటు అంటారయ్యా… పవిత్ర సంప్రదాయాన్ని నడిరోడ్డు మీదకు తీసుకురావడం, ఆడవారి జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా అని అడిగా.నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ చేస్తే, ఇలా భార్యలను మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలి? అని అడిగా. అంతే… ఆ పెద్ద మనిషిలో బీపీ పెరిగిపోతోంది… చేతులు ఊపుతూ, కాళ్లు ఊపుతూ, తల ఊపుతూ మనిషంతా ఊగిపోతాడు… దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేం… అంటూ సీఎం జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article