రేపటితో అఖరు
ప్రజాభూమి,వరదయ్యపాలెం.
రైతు భరోసా 2023-24 కి సంబందించి రైతు భరోసా పథకం దరఖాస్తు నమోదు చేయుటకు 03-05-2023 తేది వరకు అవకాశం కల్పించారు.కావున అర్హత ఉండి,రైతు భరోసా డబ్బులు పడని వారు,కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతు సోదరులు, రైతు భరోసా కేంద్రం వద్ద,గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.
(1) పట్టాదార్ పాస్ బుక్ లేదా 1బి నమూనా (2) ఆధార్ కార్డు, (3)చరవాణి నంబరు,(4) కుల ధ్రువీకరణ పత్రాలు ఇందుకు కావాలసినవి.ఒక వేల భూ యజమాని చనిపోయిన యేడల, అతని మరణం ధృవీకారణ పత్రం నామినీ కి సంబందించిన పై వివరాలు,ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్,లాయర్ అఫిడవిట్ మొదలుగునవి తీసుకుని రావాలి అని వరదయ్యపాలెం మండల వ్యవసాయ అధికారి సుహార్ లత తెలియజేసారు.సందేహాలకు వ్యవసాయ శాఖ,వరదయ్యపాలెం ఫోన్ నెంబర్ 8331057773 నందు సంప్రదించవచ్చని తెలిపారు.

