ఏలేశ్వరం:-ఈ నెల 31వతేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏలేశ్వరంలో ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరగబోయే ఏలేశ్వరం మండల జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల బీసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, ఎం ఎన్ ట్రస్ట్ చైర్మన్ మూది నారాయణ స్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకి తీరని అన్యాయం చేశారని,తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులు అందరూ ఈ సమావేశానికి హాజరు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దనేకుల వీరభద్రరావు,ఒనుం మంగ,వైబోగుల సుబ్బారావు,బెల్లాని శ్రీను, పతివాడ రామకృష్ణ,కోరాడ కృష్ణ,జొన్నాడ వీరబాబు, శంఖానిబాబ్జీ,నీలి త్రిమూర్తులు, సామంతుల గోపాల కృష్ణ (గోపి), దనేకుల దేముడు,సామంతుల రాంబాబు,తేలు నాగరాజు,తేలు రాజు తదితర బీసీ నాయకులు ఉన్నారు.

