లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 32 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈఓ నాగరాజు తెలిపారు. గురుకుల పాఠశాలయ్య సెంటర్లు 244 మంది విద్యార్థులకు గాను 234 మంది విద్యార్థులు హాజరుకాగా పదిమంది గైర్ హాజరయ్యారు. గురుకుల పాఠశాల బి సెంటర్లో 152 మంది విద్యార్థులకు గాను 145 మంది విద్యార్థులు హాజరుకాగా 7 మంది గైర్హాజరయ్యారు. ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో 171 మంది విద్యార్థులకు గాను 164 మంది విద్యార్థులు హాజరుకాగా ఏడుగురు పరీక్షకు హాజరు కాలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 155 మంది విద్యార్థులకు గాను 147 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ కేంద్రంలో 8 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు. రెండవ రోజు 722 మంది విద్యార్థులకు గాను 690మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని 32 మంది విద్యార్థులు పరీక్షలకు గైరుహాజరయ్యారని ఎంఈఓ లు నాగరాజు, కుల్లాయప్పలు తెలిపారు. రెండవ రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు మండల విద్యాధికారులు నాగరాజు, కుళ్లాయప్పలు తెలిపారు.