వేలేరుపాడు,

గోదావరిలో ప్రవాహం నిలిచిపోయి, నీరు కలుషితమై, అవి సేవించి అనారోగ్య ఫాలు అవుతున్న గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని , రుద్రంకొట గ్రామపంచాయతీ సర్పంచ్ నాగంపల్లి స్వర్ణలత మూడు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి, బుధవారం ప్రారంభించారు, ఈ గ్రామం ఉండటానికి జీవనది గోదావరి ఒడ్డునే ఉన్నప్పటికీ, పోలవరం ప్రాజెక్టు కారణంగా నీటి ప్రవాహం నిలిచిపోవడంతో, గతంలో ఎంతో పరిశుభ్రంగా దాహార్తిని తీర్చే గోదావరి ప్రస్తుతం కలుషితమై, తాగేందుకు గాని కనీసం స్నానాలు చేసేందుకు కూడా ఉపయోగపడకుండా పోయిందని వాపోవటం నదీ సమీప గ్రామాల ప్రజలయింది, దీనితో తప్పని పరిస్థితుల్లో అదే నీటిని అన్ని అవసరాలకు ఉపయోగించుకున్న గ్రామస్తులు పలు రకాల వ్యాధులతో పాటు చర్మవ్యాధులు సోకి అనునిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని వాపోవా నారంభించారు ఈ విషయాన్ని పరిగణన లోకి తీసుకున్న గ్రామపంచాయతీ సర్పంచ్ సచివాలయ సిబ్బంది ఒక నిర్ణయానికి వచ్చి మూడు లక్షల వ్యయంతో ఈ రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయడం వల్ల మంచినీరు అందించవచ్చని సదుద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన పథకం పనులు పూర్తిచేసి బుధవారం ప్రారంభించడంతో ఆ గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి దావీదు, సచివాలయ సిబ్బంది నవీన్, ఓంకార్, మీనా, రుద్రంకోట సొసైటీ అధ్యక్షులు గుద్దేటి భాస్కర్ లతోపాటు గ్రామస్తులు విరివిగా పాల్గొన్నారు.