షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో జోష్ మాజీ ఎమ్మెల్యే కమలమ్మ
పోరుమామిళ్ల:
పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారు పై దుండగులు రాళ్ళతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన ఘటనపై శుక్రవారం పోరుమామిళ్లలో కమలమ్మ స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించింది.
ఆంధ్రప్రదేశ్ లో షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అన్ని వర్గాల వారిని కలుపుకొని పార్టీ గెలుపు కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిందని నాటి పోరాటాల ఫలితమే నేడు స్వతంత్ర పాలని మనం అనుభవిస్తున్నామన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు.
పార్టీ బలోపేతానికి అన్ని వర్గాల వారిని కలుపుకుపోతామన్నారు.
ఇప్పటికే చాలామంది సీనియర్లు సొంత ఇంటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
130 సీట్లతో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం వేస్తుందని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు అందరినీ కలుపుకొని కలిసికట్టుగా పని చేస్తామని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కమల్ ప్రభాస్, సుధీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.