చింతలపూడి అభ్యర్థి విజయరాజు

కామవరపుకోట
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చింతలపూడి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి కంభం విజయ రాజు అన్నారు. గాంధీజీ కన్న కలలు నిజం చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన ఆసియా సాధనాలను నెరవేర్చుకోవాలంటే జగన్ అన్న రాజ్యం రావాలని ఆయన కోరారు అందుకుగాను తనను చింతలపూడి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామపంచాయతీ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు కేతవరం గ్రామంలో అడుగుపెట్టగానే గాలి వాన సైతం లెక్క చేయకుండా ప్రచారం కొన సాగించారు.ఈ కార్యక్రమం లో కార్యకర్తలు నాయకులు వైయస్సార్సీపి అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

