బ్యూరో శ్రీ సత్యసాయి జిల్లా:
జిల్లాలోని పెనుకొండ కోర్టు నందు న్యాయవాది గా ప్రాక్టీసు చేయుచున్న నాగరాజును రాష్ట్ర వైయస్సార్ పార్టీ లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమించ బడ్డారు. ఆయన ప్రస్తుతం పెనుకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు గతం లో స్థానిక సెషన్స్ కోర్టు లో ఏపీపీ గా పనిచేశారు, జూనియర్ న్యాయ వాదులు సంక్షేమం కోసం ప్రభుత్వం ఇస్తున్న లా నేస్తం ప్రయోజనం అభినందిస్తూ శ్రీ జగన్ మోహన్ రెడ్డి కి పాలాభిషేకం నిర్వహించారు, శుక్రవారం తోటి న్యాయ వాదులు, వైఎస్సార్సీపీ నాయకులు బార్ అసోసియేషన్ హాల్ నందు ఆయన ను ఘనంగా అభి నందించారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనను జాయింట్ సెక్రటరీ గా నియమించిన రాష్ట్ర సీఎం
జగన్మోహన్ రెడ్డి పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ
రాష్ట్ర మంత్రి వర్యులు, పెనుకొండ నియోజక సమన్వయ కర్త శ్రీమతిఉషశ్రీ చరణ్ , ఏపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి
లకుకృతజ్ఞతలు తెలియ జేస్తూ, తనకు అప్పగించిన బాధ్యత ను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని తెలియ జేశారు. ఈసందర్భంగా ఆయనకు తోటి న్యాయవాదులు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో న్యాయవాదులు శర్మ, జావిద్, నాగిరెడ్డి, వాల్మీకి శ్రీనివాసులు, మోహన్, విక్రాంత్ నాయక్, కురుబ అశ్వత్ నారాయణ, దేవాంగం శ్రీనివాసులు, బాలాజీ, హరి, పాల్గొన్నారు.