కామవరపుకోట
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావికంపాడు భారత స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు యాక్సిడెంట్ లో కాలు విరిగి చికిత్స చేయించుకున్న రావికంపాడు గ్రామానికి చెందిన ఏలేటి జాన్ కు నెలకు సరిపడా వంటసరుకులు బియ్యం,నూనె, కందిపప్పు,ఉల్లిపాయలుమొదలైనవి ఇచ్చియున్నారు. గైడ్స్ విద్యార్థులను, స్కౌట్ మాస్టారు బి నాగేశ్వరరావును, ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి భీమరాజు ,ఉపాధ్యాయులు, గ్రామస్థులు, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,యం.పి.టి
సి అంజిరెడ్డి, సర్పంచ్ వేముల నాగేశ్వరరావు, ప్రసాద రెడ్డి, ఏసుబాబు, రాంబాబు గారు,సత్యన్నారాయణ అభినందించారు, ఈ సందర్బంగా జిల్లా స్కౌట్ ట్రైనింగ్ కమిషనర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కౌట్ విద్యార్థులలో ఇటువంటి సేవభావం వారి మంచి భవిష్యత్ కు పునాది అని అభినందించారు. ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి స్కౌట్స్ యొక్క నినాదాలు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.