- పరుష పందేలను ప్రారంభించిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..
- పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువత..
చంద్రగిరి
చంద్రగిరి మండలం రామిరెడ్డి పల్లిలో శుక్రవారం ఉత్సాహం ఉప్పొంగింది. పశువుల జాతర సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో ఈ వేడుకలు ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. ముఖ్య అతిథిగా విచ్చేసిన తుడా ఛైర్మెన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత మోహిత్ రెడ్డిని తమ భుజాలపై ఎత్తుకొని ‘ మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మోహిత్ రెడ్డి పరుష పందేలను వీక్షించారు. పశువుల జాతర వీక్షించేందుకు తరలివచ్చిన వారికి భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు మోహిత్ రెడ్డి సూచించారు. యువత పెద్దఎత్తున తరలివచ్చింది. యువతకు అభివాదం చేస్తూ ఉత్సాహ పరిచారు. అంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మోహిత్ రెడ్డి నివాళులు అర్పించారు. కోడె గిత్తలకు కట్టిన పలకలు సొంతం చేసుకొనేందుకు పోటీపడ్డారు. కోడెగిత్తలకు కట్టిన పలకలు సొంతం చేసుకున్న విజేతలు విజయోత్సాహంతో సంబరాల్లో మునిగి తేలారు. ఫొటోలు దిగుతూ సందడి చేశారు.రామిరెడ్డి పల్లి సర్పంచ్, చంద్రగిరి వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి, చంద్రగిరి డివిజన్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.