Wednesday, May 7, 2025

Creating liberating content

సినిమారామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్..?

రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్..?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ బీర్ కపూర్ రాముడిగా నటిస్తోన్న సినిమా రామాయణం. ఈ సినిమాను హిందీ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. రామాయణం సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ కనిపిస్తే సీతగా సాయి పల్లవి నటించనుందని మొన్నటి వరకు టాక్ నడిచింది. కానీ, ఈ మధ్య సాయి పల్లవి స్థానంలో సీతగా దేవర భామ జాన్వీ కపూర్ నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.కేకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ రోల్‌లో విజయ్ సేతుపతి అలరించున్నాడు. అయితే, తాజాగా ఈ రామాయణం సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. రామాయణం సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ రోల్ చేయనుందని సమాచారం. ఇందులో రావణుడికి చెల్లెలుగా శుర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకోవాలనుకుంటున్నాడట డైరెక్టర్ నితీష్ తివారీ. ఇప్పటికే రకుల్ ప్రీత్‌తో రామాయణం టీమ్ చర్చలు జరిపిందట.చూస్తుంటే రామాయణం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే యష్‌కు రకుల్ చెల్లెలుగా నటించాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి ఇతిహాస సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదు. కాబట్టి, రామాయణం సినిమాలో రకుల్ నటించేందుకు ఉత్సాహంగా ఉందని బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ నటించే తొలి సినిమా రామాయణం అవుతుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article