రేషన్ బియ్యం డాన్ రామచంద్రుడుకు ఎదురే లేదా?
*జోరుగా నూజివీడు నియోజకవర్గం లో రేషన్ అక్రమ రవాణా

నాలుగు మండలాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు
*మారింది ప్రభుత్వమే రేషన్ దందాకు ఆడ్డే లేదు..
*అధికారుల్లో రామచంద్రుడుకి అంతా పలుకుబడి ఉందా …ఉండే ఉంటది…
అతగాడికి అడ్డొస్తే ఎవడైనా ఖతమేనా?
*పోలీస్ అధికారులు సైతం రామచంద్రుడి అడుగులకు మడుగులు ఒత్తాల్సిందేనా..?
*ఆ ముడుపుల కోసం అడ్డదిడ్డంగా వ్యవహరిస్తారా…
బెదిరింపులలో పోలీస్ అధికారుల పాత్ర ఉందా?
(మత్తె బాబీ ప్రజాభూమి స్పెషల్ కరెస్పాండెంట్ ఏలూరు నుంచి)
- ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోందనే బహిరంగ ప్రచారం జరుగుతోంది.గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగిన రేషన్ బియ్యం దందా కూటమి ప్రభుత్వంలోను యధావిధిగానే కొనసాగుతుండడం విశేషం
- ఏ ప్రభుత్వం ఉన్నా ఈ అక్రమ రవాణాలో రామచంద్రుడి ప్రధాన పాత్రధారులు మాత్రం ఉండి తీరతారని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.పోలీసు రెవెన్యూ అధికారుల సహకారంతో గత ఆరేళ్ల నుంచి ఈ బియ్యం అక్రమ రవాణా సాగుతుందన్న ప్రచారం సాగుతోంది.
పక్కాగా బియ్యం సేకరణ - రేషన్ బియ్యం అర్హత ఉన్న లబ్ధిదారుల నుంచి కొందరు రేషన్ షాప్ డీలర్లు కేజీ 12 నుంచి 15 వరకు డిమాండ్ ను బట్టి కొంటున్నారనేది బహిరంగ సత్యం. వాటిని 15 నుంచి 18 వరకు ఈ రైస్ డాన్ రామచంద్రుడి దళారులు కొనుగోలు చేస్తారనేది అక్కడి ప్రజల నుంచి సమాచారం. ఆగిరిపల్లి,నూజివీడు ముసునూరు,చాట్రాయి మండలాల నుంచి ఈ బియ్యం కొనుగోలును మండలానికి ఒకరు చెప్పిన నలుగురు పర్యవేక్షిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- వారి నుండి ఈ రైస్ డాన్ రామచంద్రుడు 20 నుంచి 22 రూపాయలకి కొనుగోలు చేసి 27 రూపాయలకు ఎగుమతి చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది.
ఒక నియంతలా….రౌడీలా? - సాధారణంగా రేషన్ డీలర్ల షాపుల నుండి ఈ రేషన్ బియ్యాన్ని కోళ్ల ఫారాలు యజమానులు వారి అవసరార్థం కొనుగోలు చేస్తూ ఉంటారనేది అందరికి తెలిసిన విషయమే.
- అయితే ఆ రేషన్ డీలర్లను సైతం ఒక నియంతలా… రౌడీలా అమ్మితే తమకే అమ్మాలని లేదా అధికారులచే దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నట్లు కూడా సమాచారం
- ఇక చేసేదేం లేక రేషన్ డీలర్ల సైతం ఈ రైస్ డాన్ రామచంద్రుడి అనుచర దళారులకే అమ్ముతున్నట్లు ప్రచారంలో ఉంది
దళారులకు సొమ్ము ఎగవేత, బెదిరింపులు - అక్రమ బియ్యం కొన్న రామచంద్రుడు దళారులకు సొమ్ము ఎగవేత చేయడం ఆపై పోలీసు అధికారులతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయిస్తామని బెదిరింపులు కూడా చేయిస్తున్నట్లు బాధితులు ద్వారా తెలుస్తోంది, ఎక్కడో చాట్రాయి మండలంలో రామచంద్రుడి దళారులు గోడ మీద పిల్లి (గోపి), మంకొల్లు మధనమధు తమకు రావలసిన బకాయి సొమ్ము నిమిత్తం రామచంద్రుడి రేషన్ బియ్యం బండిని ఆపగా వెనువెంటనే రంగంలోకి దిగిన ఓ పోలీస్ అధికారి,ఆపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసు నమోదు చేస్తామని బెదిరింపులు చేయడం , రేషన్ డాన్ రామచంద్రుడి కోసం ఖాఖీ లు కూడా తమ వృత్తిని పణంగా పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాకినాడ పోర్టుకు పెద్ద ఎత్తున తరలింపు - ఇలా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని పెద్ద లారీల్లో లోడ్ చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది ఇలా వెళ్లే ప్రతి లారీ ముందు ఒక కారు ఎస్కార్ట్ గా వెళుతూ మార్గమధ్యంలో ఎవరికి ఇవ్వాల్సిన సొమ్ములు వారికి చెల్లిస్తూ ఉంటారని వినికిడి.ఇలా మొత్తంగా రామచంద్రయ్య లీలలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండడం విశేషం
నెరవేరని కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఎన్నో ఆశయాలతో లక్ష్యాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు
ఈ రేషన్ బియ్యం మాఫియా తూట్లు పొడుస్తుందనే చెప్పాలి
పేదవారికి చెందవలసిన ఈ రేషన్ బియ్యం విషయంలో కూటమి ప్రభుత్వం పెద్దలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది అవినీతి అధికారుల తీరుతో రేషన్ బియ్యం డాన్ రామచంద్రుడి లాంటి వారి అక్రమ చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, ఇప్పటికి కొంతమంది నిజాయితీగల పోలీస్,రెవెన్యూ,విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ పైస్థాయి అధికారుల ఒత్తిడి చేత అవి కాస్త తూతు మంత్రంగా జరుగుతుండడం ఇటువంటి రామచంద్రుడు లీలలకు అదుపు లేకుండాపోయింది
ఏదేమైనాప్పటికీ ఇటువంటి వారిపట్ల కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని పేదవారికి చెందవలసిన బియ్యాన్ని వారికి అందేలా చూడాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.