జడ్పిటిసి వసంతరావు
ప్రజా భూమి, జీలుగుమిల్లి
రానున్న రోజుల్లో కూడా జగనన్నే మా నాయకుడని జీలుగుమిల్లి జడ్పిటిసి మల్లం వసంతరావు అన్నారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం సచివాలయ పరిధిలో పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా సచివాలయ పరిధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారుగా 15కోట్ల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేయగా,అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుమారుగా 1కోటి 20 లక్షలను వెచ్చించిన వివరాలను సచివాలయంలో డిస్ ప్లే బోర్డును సచివాలయం ఆవరణలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మల్లం వసంతరావు,ఎంపిపి కోర్స పొసమ్మ,ఎంపిటిసి సున్నం సురేష్,సర్పంచ్ వనమా రాంబాబు,జీలుగుమిల్లి సొసైటీ అధ్యక్షులు బాధ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరావు,బి.ప్రేమ్ కుమార్,నెర్సు నరేంద్ర,గంధం బోస్,గంధం చిన వెంకటేశ్వరరావు,నార్లపాటి శ్రీను సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు,గ్రామస్తులు పాల్గొన్నారు.అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి ‘వై ఏపీ నీడ్స్ జగన్’కార్యక్రమంలో భాగంగా నాయకులు,కార్యకర్తలు వైసిపి జెండాను ఆవిష్కరించి,రాష్ట్రానికి మళ్ళీ జగనే ఎందుకు కావాలి అని గ్రామస్తులకు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అడుగడుగునా నాయకులను స్వాగతిస్తూ రాబోవు రోజుల్లో జగన్ అనే కావాలంటూ నినాదాలు చేశారు దీంతో రాజకీయ నాయకులకు ఎక్కడ లేని సంతోషం కలిగినట్లు అయింది.