జీలుగుమిల్లి:కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏలూరు రావడంతో పోలవరం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బిజెపి జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ ఆధ్వర్యంలో బయలుదేరారు. ఏలూరు ఇండోర్ స్టేడియం లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం పాల్గొనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో బిజెపి ఒంటరిగానే పోటీ చేసే నేపథ్యంలో ఈ కార్యక్రమానికి బల ప్రదర్శనగా ప్రతి నియోజవర్గం నుండి బిజెపి కార్యకర్తలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తన ఓటు పర్సంటేజ్ ను పెంచుకొని 20 29 నాటికి అధికార దిశగా అడుగులు వేసే నేపథ్యంలో కేంద్ర నాయకత్వ ఆధ్వర్యంలో విస్తృత పర్యటనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో బిజెపిని ఆదరించి కేంద్రంలోనూ మోడీ నాయకత్వం ఆదరించి దేశ పురోగతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పోలవరం నియోజవర్గంలోని ఏడు మండలాల నుండి బిజెపి కార్యకర్తలు బూత్లెవలు కన్వీనర్లు ఈ కార్యక్రమాంలో పాల్గొన్నట్లు చెప్పారు.