కనిగిరి
ప్రకాశం జిల్లా వైసిపి అధికార ప్రతినిధి రాజాల ఆదిరెడ్డిని శ్రీ సాయి కృష్ణ దివ్యాంగుల సంక్షేమ సంఘం బృందం బుధవారం ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. సంస్థ సంఘం అధ్యక్షుడు దోసపాటి నరసయ్య మరియు దివ్యంగా బృందం రాజాల ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేసిన వ్యక్తి రాజాల ఆదిరెడ్డి అని ఆయన మంచి మనిషి మృదు స్వభావం సేవ భావం కలవారు ఆదర్శమూర్తి అయినటువంటి రాజాల ఆది రెడ్డి ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని మాలాంటి వారికి ఎంతో మందికి సహాయపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని దివ్యాంగులు అందరూ తెలియజేశారు. తదుపరి దివ్యంగా సంఘం అధ్యక్షులు మరియు దివ్యంగా బృందం కలిసి రాజాల ఆది రెడ్డి కి చిరు సత్కరం చేశారు. ఈ సందర్భంగా రాజాల ఆదిరెడ్డి మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగులకు నా వంతు సహాయ సహకారాలు వెళ్లవేల ఉంటాయని అలాగే శ్రీ సాయి కృష్ణ దివ్యాంగుల ఆశ్రమానికి సహాయం అందజేస్తానని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు యం.ఏడుకొండలు, అండ్రా మనోహర్, మరియు కనిగిరి మండల దివ్యాంగుల అధ్యక్షులు పాలూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఇంద్రకంటి దేవ సహాయం, సభ్యులు వేమవరపు కిషోర్, ఇండ్ల వెంకట్ రమణయ్య, హారికట్ల ఆచారి, బల్లారపు నరసయ్య శ్రీధర సాయి తదిదారులు పాల్గొన్నారు.

