తుని టీడీపీ ఇన్ ఛార్జ్ యనమల దివ్య
తుని
సామాజిక బాధ్యత తో రాజధాని ఫైల్స్ సినిమా తీస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటు అని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య ప్రశ్నించారు. ఈ సినిమా జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తుందని అందుచేతనే సినిమాలు అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నుతున్నదని ఆమె వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా ద్వారా జగన్ రెడ్డిపై ఉన్న ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువైంది అన్నారు. 34 వేల మంది రైతుల త్యాగాలకు వాస్తవ రూపంగా రాజధాని ఫైల్స్ సినిమా అన్నారు. అమరావతి రైతుల ఉసురు జగన్ రెడ్డికి శాపాలుగా మారుతాయన్నారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ను బొమ్మలాట ఆడించారన్నారు. నిన్నటి దాకా మూడు రోజులు జపం చేసిన వైసిపి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొత్త పల్లవి అందుకుందని యనమల దివ్య అన్నారు