రామచంద్రపురం
తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం సి. రామాపురం, రామచంద్రాపురం మండల కేంద్రం, కమ్మ కండ్రిగ పంచాయతీల్లో తిరుపతి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు రాష్ట్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమ్ముల్లో ఉందన్నారు. కౌంటింగ్ సందర్భంగా రాజకీయ నాయకులు ఎక్కడ ఊరేగింపులు, బాణసంచా కాల్చడం ఆర్భాటాలు చేయకూడదని హెచ్చరించారు. గ్రామాలలో ప్రశాంతత వాతావరణం ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

