ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సారి ఓటు వేసే యువతకు అవగాహన సదస్సు.
మార్కాపురం :మార్కాపురం.పట్టణంలోని.మొదటిసారి ఓటు వేసే యువత సామాజిక దృక్పథంకలిగి ఉండాలని వారి ఓటు సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తుందని టిడిపి యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు.మార్కపురం మండల కేంద్రంలోని ఓ ప్రవేట్ పాఠశాలలో ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటిసారి ఓటు హక్కు పొందిన యువతకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాగుంట రాఘవ రెడ్డి హజరయ్యారు.ఈ సందర్బంగా మొదటిసారి ఓటు వేసే వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు, యువతతో ముఖాముఖి సంభాషణ ద్వార సమాజంలో ఓటు హక్కు సాదించే సామాజికాభివృద్ధి గురించి వివరించారు. మొదటి ఓటు మంచి సమాజానికి చెట్టులా నీడనివ్వాలి కాని చేటుగా నిలువకూడదని ఎస్ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.ఆనంతరం ఎస్ ఫౌండేషన్ నిర్వహకులు ఇమ్మడి నాగరాజు,సుప్రియ నేతృత్వంలో యువతకు స్పూర్తినిచ్చే అంశాలను చర్చించారు.సమాజంపై అవగాహన ఓటు హక్తు విలువలను గుర్తించే కార్యక్రమంలో యువత దూర ప్రాంతాల విద్యార్థులు సైతం ఉత్సహంగా పాల్గోన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ
యువత ఫస్ట్ ఓట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.మీ ఓటు ఒక అవసరం కోసం కాదు, అనేక అవకాశాల కోసం ఓటు వేసి మీ హక్కుని వినియోగించుకోవాలని సూచించారు.మీరు వేసే ఓటు ఐదేళ్ళ కాలం ప్రభుత్వంగా నిలుస్తుంది.ఏ నాయకుడినీ ఎన్నుకోవాలి ఎందుకు ఎన్నుకోవాలి, అనే అంశాలపై అవగాహన సాదించే తమ ప్రాంత సమస్యలను పరిష్కరించే మంచి చేసే వారికే ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఫౌండేషన్ కమిటి సభ్యులతో పాటు, విద్యార్థులు,అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
