ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో రోడ్డుపై ఓ యువతి గొడ్డలితో శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో యువతి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. దాడి జరుగుతున్న సమయంలో అడ్డుకోబోయిన ఆమె వదిన, మూడేళ్ల కొడుకుపై కూడా ప్రేమోన్మాది గొడ్డలితో దాడి చేశాడు. దీంతో తల్లీ, కొడుకుకు గాయాలయ్యాయి. స్థానికులు వచ్చేసరికి శ్రీకాంత్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.