-కళాకారుల కాలనీలో తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం
రాప్తాడు :రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మండల తెదేపా ఇన్చార్జ్ పరిటాల సునీత సోదరుడు ధర్మవరపు మురళి పేర్కొన్నారు . శనివారం మండల పరిధిలోని ప్రసన్న పల్లి పంచాయతీలోని కళాకారుల కాలనీలో తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయండి అని అభ్యర్థించారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా కాలం గడిపారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెరువుల కు నీరు సరఫరా చేయక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళ ముందర సిసి దారులు నిర్మించలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తరలివచ్చాయని వైకాపా పాలనలో ఒక్క పరిశ్రమ కూడా నియోజకవర్గానికి రాలేదని జాబు రావాలంటే బాబు రావాలి అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పరిటాల సునీత గెలిపించాలని , ఎంపీగా పార్థసారథి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోమండల కన్వీనర్ పంపు కొండప్ప , ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు ,గంగలకుంట రమణ , ఉప్పరశ్రీనివాసులు , సాయినాథ్, గుజ్జల నారాయణస్వామి, , గోనిపట్ల శీన,మరోరు గోపాల్ ,సర్పంచ్ సాకే తిరుపాల్ , ఎంపీటీసీ జాఫర్ , బాబయ్య , ,ఇంద్రశేఖర్ , సాకే నారాయణస్వామి, శిక్షావలి,గంగలకుంట కిష్ట , ఎంపీటీసీ రవి,మోహన్ రెడ్డి, సాకే జయరాముడు , డిష్ వెంకటరాముడు , గోపాల్, ప్రసాద్ , ముత్యాలు ,మరూరు కదిరప్ప , మరూరు నరేష్, జూటూరు రామకృష్ణ , బీరన్న , బొమ్మపర్తి రాజశేఖర్ రెడ్డి, , రాజలింగం,నరసింహులు ,గేట్ సత్తి , శాంతా, స్వర్ణక్క,ధనలక్ష్మి,లక్ష్మన్న తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .