అధ్యక్ష ,కార్యదర్శులుగా బానుప్రకాశ్ ,గణేష్ లు
ప్రజాభూమి, కాజులూరు
యునైటెడ్ ‘టీచర్స్ ఫెడరేషన్ (యుటియఫ్) కాజులూరు మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈమేరకు శనివారం కాజులూరు యుటియఫ్ నూతనకార్యవర్గాన్ని కాకినాడ యుటియఫ్ హోమ్ నందు ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా నక్కతిప్ప ఎంపిపి స్కూలుకు చెందిన వి. బాను ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే గౌరవ అధ్యక్షులుగా ఐ.శుభాకర్, సహా అధ్యక్షులుగా జి.బుజ్జి బాబు, సహ అధ్యక్షురాలిగా డి. మిన్నీకుమారి, ప్రధాన కార్యదర్శి గా ఎన్.గణేష్, కోశాధికారిగా రాయుడు. సుధర్, ఏఫ్ డభ్ల్యూ కార్యదర్శిగా కె.వి.వి. సత్యనారాయణ పత్రికా కార్యదర్శిగా ఎస్. దుర్గా ప్రసాద్, మహిళా కార్యదర్శి గా కె.అమ్మాజీ, కార్యదర్శులుగా ఆర్. పాండు రంగారావు, సలాది శ్రీనివాసరావు. ఐ. శ్రీనివాస్, ఆర్. నాగేశ్వరరావు, కె. విజయలక్ష్మి, పి. రమేష్, మండల ఆడిటర్ గా కె. రవి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అలాగే జిల్లా కౌన్సిల్ సభ్యులుగా పాశ్చ సాహెజ్, మొయినుద్దిన్ ఖాన్, ఎం. శ్రీనివాన్, బి.వి.వి ఎస్ నాగమణి, ఆర్. జయ ప్రకాష్, వి.గౌతమి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యుటియఫ్ అధ్యక్షుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ తనపై పెట్టిన బాధ్యతకు మండల ఉపాధ్యాయుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా తాను పాటుపడతానన్నారు. మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సహచర ఉపాధ్యాయులకు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు .
నూతన కార్యవర్గనికి పలువురు అబినందనలు.
నూతనంగా ఎన్నికయిన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు. సుమారు 50 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో యూటియఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, యూనియన్ నాయకులు ఐ. ప్రసాదరావు, సాపే శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ , అన్నారం తదితరులు పాల్గొన్నారు.