కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం షారుక్‌తో చర్చలు గీతూ మోహన్ జరుపుతున్నారని.. ఇందులో ఆయనది ఓ పవర్ ఫుల్ రోల్ అని..దీన్ని షారుక్ మాత్రమే చేయగలరని చిత్రబృందం గట్టిగా నమ్ముతోందని.. త్వరలో దీని గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాం” అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను మేళవించి రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా ఈ సినిమా కథ ఉండబోతుందని తెలిసింది. యశ్ 19వ ప్రాజెక్ట్ అయిన ఈ ‘టాక్సిక్’లో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.