Wednesday, November 12, 2025

Creating liberating content

తాజా వార్తలుమోడల్ నియోజకవర్గంగా పిఠాపురం

మోడల్ నియోజకవర్గంగా పిఠాపురం

పిఠాపురంకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్
పిఠాపురం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉంది :పవన్ కల్యాణ్

పిఠాపురం :పిఠాపురంలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభలో జనసేనాని పవన్ ప్రసంగించారు.తనను ఓడించడానికి చిత్తూరు నుంచి మిధున్ రెడ్డి వచ్చాడన్నారు. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టలేని తాను అంటే ఎందుకు కక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. మండలానికి ఒక నాయకుడు ఎందుకు వచ్చాడని.. కాకినాడ మాఫియా డాన్ నన్ను ఓడిస్తాడా అంటూ ఎద్దేవా చేశారు.పిఠాపురంలో ఇల్లు తీసుకుంటానని, ఇక్కడే ఉంటానని పవన్ పేర్కొన్నారు. దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతానన్నారు. 54 గ్రామాలు ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎన్నికలకి కాదు.. గుండెల్లో పెట్టుకోవడానికి పిఠాపురం వచ్చానన్నారు. పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానన్నారు.పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని.. ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రం మొత్తం తిరిగే తాను పిఠాపురాన్ని వదిలేస్తా అనుకోవద్దన్నారు. పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యతను తీసుకున్న టీడీపీ కోఆర్డినేటర్ వర్మకి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. . ఓడిపోయినా దశాబ్ధ కాలం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానన్నారు. దయచేసి తనను గెలిపించాలని, ప్రజల ఆశీర్వాదం తనకు కావాలన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article