Saturday, May 10, 2025

Creating liberating content

తాజా వార్తలుమైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పీరా సాహెబ్

మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పీరా సాహెబ్

వేంపల్లె
టిడిపి మండల మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పీరా సాహెబ్ ను నియమించినట్లు మండల కన్వీనర్ రామమునిరెడ్డి, మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వలిలు తెలిపారు. వేంపల్లెలోని గరుగువీధికి చెందిన పీరా సాహెబ్ కు ఆదివారం మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని మండల కన్వీనర్ రామమునిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పీరా సాహెబ్ పాల్గోన్నడంతో పార్టీ గుర్తించి పదవిని ఇచ్చినట్లు చెప్పారు. అలాగే షేక్ అల్లాబకష్ కు కార్యవర్గ సభ్యుడుగా నియమించినట్లు తెలిపారు. టిడిపి పార్టీలో ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని చెప్పారు. పులివెందుల అసెంబ్లీలో టిడిపి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలని కోరారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించి పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పదవులు పొందిన నాయకులు మరింత బాధ్యతగా పని చేయాలని చెప్పారు. తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్,
ప్రధాన కార్యదర్శి మహమ్మద్, మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వలి, నిమ్మకాయల మహమ్మద్ దర్బార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలని కార్యనిర్వాహక కార్యదర్శి పీరా సాహెబ్ చెప్పారు. బాధ్యతగా పని చేసి పులివెందుల అసెంబ్లీ ఇంచార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగన్నాథరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, మడక శ్రీనివాసులు, వేమా కుమార్, మహబూబ్ షరీఫ్, అల్లాబకష్, మారుతిలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article