తుని :క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి ఎదగాలని యువనేత యనమల రాజేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.కార్పోరేట్ స్థాయి
విద్యను ప్రభుత్వ బడుల ద్వారా అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకుని భవిష్యత్తుకు పునాదులు నిర్మించుకోవాలని విద్యామిత్ర కార్యక్రమంలో ఆయన
కోరారు.తొండంగి మండలంలో విద్యా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేష్ విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో చొక్కా అప్పారావు
కాలిబోయిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు

