మార్కాపురం:తర్లుపాడు మండలం మంగళ కుంటకు చెందిన రాచకొండ గాలెయ్య(65) హార్ట్ ఎటాక్ తో మంగళవారం రాత్రి మరణించారు..విషయాన్ని స్థానిక సర్పంచ్ గుమ్మా రాజేంద్ర ప్రసాద్,ఎంపీపీ భూ లక్ష్మీ రామ సుబ్బారెడ్డి ద్వారా మార్కాపురం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అభ్యర్ధి,ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు కి తెలిపారు..వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించమని ఎమ్మెల్యే అన్నా ఎంపీపీ ని ఆదేశించారు..ఎంపీపీ భూ లక్ష్మీ రామ సుబ్బారెడ్డి,స్థానిక సర్పంచ్ గుమ్మా రాజేంద్ర ప్రసాద్,పార్టీ నాయకులు శివన్నారాయన రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను కలసి సానుభూతి తెలిపి పార్థివ దేహానికి నివాళి అర్పించారు..ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు అందించిన ఆర్ధిక సహాయం కుటుంబ సభ్యులకు అందించారు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు_