కాకినాడ ఎంపీ గీత
గొల్లప్రోలు
ముఖ్యమంత్రి జగన్ ఈనెల 3వ తేదీన ఏలూరులో నిర్వహించనున్న బహిరంగ సభకు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ పిలుపునిచ్చారు. గొల్లప్రోలులోని సురేష్ కళ్యాణమండపం లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గం నుండి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మొగలి విమల బాబ్జి, అన్నవరం దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడు మొగలి అయ్యారావు, పట్టణ సచివాలయాల వార్డు కన్వీనర్ల కమిటీ చైర్మన్ మొగలి సాంబశివ, పార్టీ సీనియర్ నాయకుడు కౌన్సిలర్ గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి,మండల పార్టీ అధ్యక్షుడు అరిగెల రామన్న దొర, పట్టణ అధ్యక్షుడు మైనం రాజా, మాజీ ఎంపీపీ బద్ది బుల్లియ్య తదితరులు పాల్గొన్నారు.