Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్ముందే చెప్పిన ప్రజాభూమి…

ముందే చెప్పిన ప్రజాభూమి…

*పశ్చిమ నియోజకవర్గంలో పచ్చిగా దోచుకున్నారంటూ..
*ప్లాన్ ల ముసుగులో పైసలు దండుకున్నారనేది నిజమేనా ..?
*వీరి అవినీతి చూసి ఆ ఎమ్మెల్యే అవాక్కయ్యడా…!
*వీరితోనే ప్రక్షాళన జరిగినట్లే నా…?

  • ఏసిబి దాడుల కు భయపడి అర్థరాత్రి ఆఫీస్ కు వచ్చే అధికారికి అంతా మాములేనా…!
  • ఈ ఇద్దరూ సరే..ఆ .ముగ్గురూ కరెక్ట్ నా ..
  • బ్రోకర్ ల చేతిలో ప్లానింగ్ లు ఇక లేనట్లేనా…
  • అసత్యపు, అబద్ధాల వాయిస్ ల ఆటలు అడ్డుకట్ట పడతాయా…
  • బదిలీ సరే అక్రమ నిర్మాణాల సంగతేమిటో…
  • కార్పొరేటర్ కాసుల రెడ్డికి కాలం కలిసి రానట్లేనా…
  • డీసీపీ బోస్ నిర్లక్ష్యమే కారణమా…
  • కోట్లు కొల్లగొట్టినట్లు వస్తున్న ఆరోపణలలో నిజమెంత…
  • నిజాలు నిగ్గు తేల్చుతారా…నేల పాలు చేస్తారా….
  • మేడం… మేడమేనా…నేతాజీ దంతా నీతి గానే ఉన్నాయా…
  • ప్రసాదాల ప్రదీప్ పక్కాగా ప్లాన్ అమలు చేశాడా…
    *పిజిఆర్ ఎస్ ఫిర్యాదులు కూడా లెక్కచేయని వైనం..
    *వాట్సాఫ్ మెసేజ్ లతో ముగింపు సరిపోతుందా…
    *ఫిర్యాదుల పై కమిషనర్ కలవర పడ్డట్లేనా…
    *చీఫ్ సిటీ ప్లానర్ చిర్రెత్తి పోయి నట్లేనా…
    *దసరా మముళ్ల దెబ్బ బాగా తగిలినట్లే నా…
    పూర్తి స్థాయి ప్రక్షాళన ఉంటుందా లేదా…?

(రామమోహన్ రెడ్డి)

“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోని మారదు లోకం మారదు కాలం”అని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏనాడో చెప్పిన విదంగా ఒకసారి కాదు అనేక మార్లు అవినీతి అధికారులపై స్పందన పిర్యాదు చేసిన కూడా స్పందించని పట్టణ ప్రణాళిక శాఖ అధికారులకు ప్రజాగ్రహం ఎదురవ్వడం తో విధిలేని పరిస్థితులలో అవినీతి ని కప్పిపుచ్చుకునేందుకే ఓ రెండు అవినీతి తిమింగలాలను బదిలీ వేటు వేసి కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు.ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం! అన్నట్లు గా పట్టణ ప్రణాలిక విభాగంలో కొంత మంది అధికారుల అవినీతి కోకొల్లలు గా ఉందనే బహిరంగ విమర్శలు లేక పోలేదు. ఎల్పీసీ లేకుండా ఒక అవినీతి అనకొండ నాటి టీపీఓ గందం ప్రసాద్ కు పవర్ ఫుల్ బాధ్యతలు కట్టబెట్టిన ఘన చరిత్ర ఉన్న బెజవాడ కార్పోరేషన్ పై ఎంత చెప్పిన అతిశయోక్తి కాదని పిస్తుంది. కొంపలు కొల్లగొట్టి కోట్లు దోచుకున్నారనే బోలెడు విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్ పై ఓ ఎమ్మెల్యే పిర్యాదు తో బదిలీ వేటు వేశారు.గంధం అందరికీ అన్ని గోడలకు గంధం పూసి తనకు అండగా ఉన్న బ్రోకర్లకు బాగానే సరిపెట్టి కార్పొరేటర్ కిరికిరి రెడ్డి తో కాసుల బేరం కుదుర్చుకుని చివరికి కండువా కప్పుకుని పదవి విరమణ చేయగా ఆ స్థానంలో ఆ గంధం అత్యంత ప్రియ శిస్యుడు గా అనోట ఈ నోట చెప్పుకుంటున్న మురళీగౌడ్ ను తాడిగడప మున్సిపాలిటి తట్టుకోలేక బెజవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇంకేముంది నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొత్త గోడలకు పాత గోడలకు గురువు మిగిల్చిన గంధం పూస్తూ వసంతం తో వసంతాలు జరుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువు శిస్యుడు కలిసి ఓ మేడ పక్కన మేడ కు అనుమతుల విషయం లో అక్షరాల లక్షలు దోచుకుని దాచుకుని చివరికి ఆ బీల్డింగ్ యాజమాని ఎందుకురా ఈ కట్టడమని కన్నీరు మున్నీరు కారుస్తుంటే ఓ కార్పోరేటర్ పేరు చెప్పి బ్రోకర్ భార్గవ్ గాడు లచ్చలు దండుకుని దాచిపెట్టుకున్న సంగతి ఆలస్యంగా వెలుగుచూసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు దర్గా భూముల్లో షేడ్ ల నిర్మాణాల లో కార్పొరేటర్ కిరికిరి రెడ్డి ఓ వైపు ఈ నీతిలేని అధికారులు ఓ వైపు ఐరన్ యార్డ్ లలో సహా ఇంటి యజమానులను పీల్చిపిప్పి చేస్తుండడంతో చిర్రెత్తి న ప్రజలు స్పందనకు క్యూ కట్టడం,స్థానిక ఎమ్మెల్యే సుజనా, ఎమ్మెల్యే కార్యాల కార్యదర్శి శ్రీధర్ కు పెద్ద సమస్య గా మారినట్లు ఉండటం తో ఇక వీరిపై చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.అయితే ఈ అవినీతి అధికారుల తీరు ఎండగట్టే ప్రయత్నం ఎవరూ చేసిన నాలుగో స్తంభానికి నిలువెత్తు నిదర్శనం అన్నట్టు అసత్యపు,అబద్ధాల వాయిస్ లు అట్లే ఎగిసిపడి సిగ్గులేని రాతలు నిస్సిగ్గుగా రాసి పైశాచిక ఆనందం పొందుతూ బ్రోకర్ భార్గవ్ గాడి పంచన చేరి పనికిరాని పనులు చేసే ఒక ప్రత్యేక వ్యవస్థ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందనేది జగమేరిగిన సత్యం. ఇవన్నీ చూసి చూసి విసిగి వేసారిన కూటమి నాయకులుమురళీ గౌడ్ అనే అధికారిపట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేస్తూ అనేక నిర్మాణాలు వద్ద కోట్ల రూపాయలు వసూళ్ళు చేశారని కూటమి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టగా ఎమ్మెల్యే సైతం తన నియోజకవర్గంలో అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.తన నియోజకవర్గంలో టౌన్ ప్లానింగ్ అధికారులు గా పనిచేస్తున్న బిల్డింగు ఇన్స్పెక్టర్ మురళి గౌడ్, ఇన్చార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వసంత్ ఇద్దరు వ్యక్తులు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.స్థానిక ఎమ్మెల్యే అయితే అక్రమాలు సహించేదే లేదని టౌన్ ప్లానింగ్ అధికారులకు వివరించారు, దీంతో మురళి గౌడ్, వసంత్ లపై ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారని కూటమి నేతలు సైతం డిసిపి బోస్ కు ఫిర్యాదు చేశారు. డిసిపి బోస్ వారిపై చర్యలు తీసుకోకుండా ఈ వ్యవహారంలో మౌనంగా ఉండిపోయారని కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారుల కు వారిపై చర్యలు తీసుకొనేల గట్టిగానే చెప్పినట్లు సమాచారం. కూటమి నాయకుల అసంతృప్తితో పశ్చిమ నియోజకవర్గంలో ప్రక్షాళన మొదలై బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మురళి గౌడ్, ఇన్చార్జి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వసంత్ లపై వేటు వేశారని కూటమి ఎమ్మెల్యే సుజనాచౌదరి కి,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ కి అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వీరితో పాటు డీసీపీ బోస్, ఇంకొంత మంది కింది స్థాయి అధికారులపై బదిలీ వేటునా లేక అంత కంటే ఎక్కువ చర్యలు ఉంటాయా అన్నది ఆ నియోజకవర్గ పరిధిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article