చంద్రగిరి:చంద్రగిరి గ్రామ పంచాయతీలో 4వ రోజు చెవిరెడ్డి లక్ష్మీ తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.”మీ తోనే_మీ మోహిత్” కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో చెవిరెడ్డి లక్ష్మీ మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలకు పట్టం కట్టాలని, మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న మోహిత్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు చెవిరెడ్డి లక్ష్మీ తో పాటు గడప గడపకు తిరుగుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు.