నన్ను ఆశీర్వదించండి వైకాపా హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి దీపికా వేణు
లేపాక్షి: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నానని, మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి, గెలిపించాలని దీపికా వేణు ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం మండల పరిధిలోని మానేపల్లి , గౌరి గాని పల్లి, వెంకటాపురం గ్రామాల్లో వైకాపా మండల కన్వీనర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, వాటి అమలును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వైకాపా అసెంబ్లీ అభ్యర్థి దీపిక వేణు మాట్లాడుతూ, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపడితేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటిని మరిచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహిళలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది అన్నారు. వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా దీపికా వేణు, పార్లమెంట్ అభ్యర్థిగా బోయ శాంతమ్మను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ప్రసాద్, తిప్పన్న, వేణుగోపాల్ రెడ్డి, శంకరప్ప,నాగరాజు, అగ్రి బోర్డు చైర్మన్ ప్రభాకర్, లేపాక్షి సర్పంచి ఆదినారాయణ, పులమతి సర్పంచ్ అశ్వర్ధనారాయణ, చోళ సముద్రం వైస్ సర్పంచ్ చంద్ర,, ఇర్ఫాన్, బాలు, చలపతి, రామాంజి, గోపాలప్ప చోళ సముద్రం శ్రీనివాసులుతో పాటు పలువురు వైకాపా నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

