మార్కాపురం
మండలంలోని వెలుగు కార్యాలయం నందు జిల్లా ఉద్యాన అధికారి వై.యం.యన్ గోపీచంద్ గారి అధ్యక్షతన E-మిర్చా ప్రాజెక్ట్ కి సంబందించిన సమావేశం పెద్దరవీడు, మార్కాపురం, కొనకలమిట్ల, దొనకొండ, తర్లుపాడు, అర్ధవీడు, కంభం ఆర్.బీ.కె సిబ్బందికి నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.బీ.కె సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ-మిర్చా ప్రాజెక్ట్ యొక్క టెక్నాలజీ సహకారంతో మిరప పంటలో నాణ్యతా ప్రమాణాలను మరియు దిగుబడులను పెంచడం అనే విషయాలను గురించి తెలియజేస్తుందని తెలిపారు.
డిజిటల్ గ్రీన్ సంస్థ కో-ఆర్డినేటర్ కమలాకర్ మాట్లాడుతూ ఈ-మిర్చా ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మిరప నాణ్యత పరీక్షా కేంద్రాలలో, రైతుల మిరప నాణ్యత ప్రమాణాలను పరీక్షించుకుని, వచ్చిన ఫలితాల సర్టిఫికెట్ ఆధారంగా, వ్యాపారవేత్తలు, కొనుగోలుదారుల వద్ద ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క వినియోగాలు మరియు దాని యొక్క టెక్నాలజీ గురించి రైతులకు తెలియజేయాలని ఆర్.బీ.కె సిబ్బందికి ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో APMIP పీడీ రమణా రావు మార్కాపురం ఏ.డీ.ఏ రామదేవిగారు, మార్కాపురం, గిద్దలూరు హెచ్.ఓ లు రమేష్ బాబు విష్ణుప్రియ హెచ్.ఈ.ఓ వై.సి.హెచ్ శేషగిరి.మార్కాపురం, పెద్దరవీడు ఏ.ఓ లు దేవిరెడ్డి శ్రీనివాసులు బుజ్జి బాయ్ , తర్లుపాడు, పెద్దరవీడు, మార్కాపురం, కంభం, అర్ధవీడు, కొనకలమిట్ల ఆర్.బీ.కె సిబ్బంది పాల్గొన్నారు.