Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుమిట్టపాళెం గడప గడపకు మనప్రభుత్వంకార్యక్రమంలోచెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం..!

మిట్టపాళెం గడప గడపకు మనప్రభుత్వంకార్యక్రమంలోచెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం..!

చంద్రగిరి

చంద్రగిరి మండలం, మిట్టపాళెం పంచాయతీ పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ జాబితాలను అందజేశారు. ఆ తర్వాత ప్రతి ఇంటా లబ్దిదారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. గ్రామ శివార్లలో స్థానిక ప్రజలు హర్షిత్ రెడ్డికి హారతులు పట్టి సాదరంగా ఆహ్వానించి గజ మాలతో సత్కరించారు. గడప గడపలో ప్రతి ఇంటా కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మేలును, నియోజకవర్గంఅభివృద్ధిని, జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గురించి హర్షిత్ రెడ్డి వివరిస్తూ, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రాజకీయ కక్షలకు అవకాశం లేకుండా అందరినీ సమానంగా చూసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి తీరు పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మిట్టపాళెం గ్రామం నుంచే మండల పరిషత్ అధ్యక్షులుగా హేమేంద్ర కుమార్ రెడ్డి బాధ్యత నిర్వహిస్తుండటంతో స్థానిక సమస్యలు సత్వరం పరిష్కారం చేయాలని తన వెంట వచ్చిన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి,
జెడ్ పి టి సి యుగంధర్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నాయకులు డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్. మస్తాన్, చేగు గోవర్ధన గుప్త, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, హేమచంద్రారెడ్డి, విద్యార్థి నాయకుడు సూరి, జార్ బహార్, నాగరాజు, సిద్ధిక్ భాష, ఏ. రాజశేఖర్ రెడ్డి, తో పాటు పలువురు మండల స్థాయి నేతలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article