వేలేరుపాడు,
మార్చి మూడో తేదీన
ఖమ్మం లో జరిగే ,మూడు విప్లవ పార్టీల ఐక్య మహా సభలను జయప్రదం చేయాలనీ సిపిఐ ఎం ఎల్ ప్రజాపంధా మాస్ లైన్ జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ అన్నారు. నాల్లవరం గ్రామం లో అయన మాట్లాడుతూ ,మూడు విప్లవ పార్టీలు ఐక్యం అవ్వటంతో ప్రజాపంధా పార్టీ జాతీయ పార్టీ గా ఆవిర్భావించిందని, ఖమ్మం లో జరిగే భాహిరంగ సభకు మహిళలు, పురుషులు ఎర్ర వర్ణం దుస్తులు ధరించి సభను ఎర్ర జెండాలా విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి సిరికొండ రామారావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన జరిగే భారత గ్రామీణ బంద్ కు ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ సహకరించి బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ డివిజన్ మండలనాయకులు కట్టం ముత్యాలరావు, శ్రీను, కంకరాజుల మల్లికార్జునరావు, బుగ్గ రామారావు తదితరులు పాల్గొన్నారు.