పులివెందుల
మనమందరం మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం అని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డ్ లో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భం గా జాతిపిత చిత్రపటానికి పూలమాలవేసి ఘనం గా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లా డుతూదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకు వచ్చిన జాతిపిత మహాత్ముని అడుగు జాడల్లో అందరూ నడవాలన్నారు. అహింసే ఆయుధంగా బ్రిటిష్ వారిని ఎదిరించిశాంతియుతం గా పోరాడే దేశానికి స్వాతంత్రంను సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వైకాపానాయకు లు,మార్కెట్ యార్డ్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

