నాగమణి సచివాలయ ఎ.యన్.యం
హనుమంతునిపాడు :హనుమంతునిపాడు మండలంలోని నందనవనం సచివాలయం ఎ.యన్.యం నాగమణి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు వేసే వ్యాధి నిరోధక టీకాల గురించి అవగాహన కల్పించారు. నందనవనం సచివాలయం పరిధిలోని వీరరామాపురంలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు టీకాలు వేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు బాధ్యత తో వ్యవహరించాలని ఆరోగ్య కార్యకర్తను ఆశా కార్యకర్తను అంగన్వాడీ కార్యకర్తను సందర్శిస్తే సకాలంలో టీకాలు ఎప్పుడు ఎక్కడ వేస్తారో తెలియజేస్తారన్నారు.సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయటం వలన ప్రాణాంతక వ్యాధుల బారినుండి రక్షించ వచ్చన్నారు. పిల్లలకు చిన్న తల చెవులు చిన్నవిగా చదరపు ముక్కు నోరు చిన్నదిగా ఉండటం గ్రహణం మొర్రి పుట్టాక చెవుడు సంక్రమిత గుండె జబ్బులు మట్టి తినడం చర్మం పెదాలు పాదాలు గోర్లు నీలి రంగులో ఉండటం త్వరగా అలసిపోవటం చర్మ వ్యాధులు సంక్రమిస్తాయని వాటిని నివారించటానికే వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ఆరోగ్య కుటుంబ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారన్నారు. గర్భం దాల్చిన తొలిరోజుల్లో టి.డి-1 నాలుగు వారాలకు టి.డి -2 వేయాలన్నారు. తరువాత టి.డి బూస్టర్ మోతాదు వాడాలన్నారు. పిల్లలకు పుట్టిన సమయంలో బి.సి.జి, ఓ.పి.వి జీరో మోతాదు, హైపటైటిస్ బి ఆరు వారాలకు ఓపివి-1 పెంటావాలెంట్-1 రోటా-1 పిసివి-1 వేయాలని తెలిపారు. అదేవిదంగా 10 వారాలకు 14 వారాలకు పైన వాడిన మందులు 2,3 లు వాడాలని 9 నెలలు మొదలుకొని డి పి టి రూబెల్లా (యం.ఆర్)2 విటమిన్ ఎ 1,2 లు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త గోన స్వర్ణలత అంగన్వాడీ సిబ్బంది గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.


