Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుమహిళా సాధికారత కోసం జగనన్న రాష్ట్రెనికి అవసరం

మహిళా సాధికారత కోసం జగనన్న రాష్ట్రెనికి అవసరం

కాకినాడ ఎం పి. వంగా గీత

ప్రజా భూమి కాకినాడ

మహిళల సాధికారత కోసం నిరంతరం శ్రమించి అపారమైన స్వేచ్ఛను అందించిన జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత విశ్వనాధ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 32వ డివిజన్ రామకృష్ణారావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించి గడచిన నాలుగున్నర యేళ్ళ కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి అధిక ప్రాధాన్యత కల్పించి అన్ని సామాజిక వర్గాలకు కుల మతాలకతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకంలో భాగస్వామ్యం కావడం వైకాపా ప్రభుత్వం పాలనకు నిదర్శనం అన్నారు. ప్రతి కుటుంబం నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో లబ్ధి పొందడం జరిగిందని లబ్ధి పొందినవారు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ సిటీ వైసిపి ప్రెసిడెంట్ సుంకర శివప్రసాన్నసాగర్, డివిజన్ ఇంచార్జ్ రోకళ్ళ సత్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article