- బి.ఎస్ దిల్షాద్ పర్వీన్ మక్బూల్
కదిరి :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అధిక భాగం మహిళలకు కేటాయిస్తూ మహిళా పక్షపాతిగా మన్ననలు పొందుతున్న సీఎం జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి బి.ఎస్ దిల్షాద్ పర్వీన్ మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం కదిరి మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు అగ్రపీఠం వేస్తూ అన్నింటిలో సగభాగం వాటా కేటాయించిన జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలోని మహిళలకు రాజకీయ ప్రాధాన్యతను పెంచుతూ 50 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఘనత కూడా సీఎం జగనన్నకే దక్కుతుందని చెప్పారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా వంటి పథకాలు మహిళల పేరుతో వారి ఖాతాలలో నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలోని బడుగు బలహీన వర్గాల మహిళలను గుర్తించి వారిని ఉన్నత పదవులలో కూర్చోబెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పరికి నజీమున్నీసా, వైస్ చైర్ పర్సన్ కొమ్ము గంగాదేవి, కౌన్సిలర్ నూహిరా షాహిన్ తదితరులు పాల్గొన్నారు.