భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్
వేంపల్లె
కేంద్రం ప్రభుత్వం విశ్వకర్మ యోజన ద్వారా సంప్రదాయ హస్తకళలను ప్రోత్సాహించేందుకు ఆర్థిక మద్దతు అందిస్తుందని, అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ కోరారు. గురువారం వేంపల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రధాని మోడీ రూ.13 వేల కోట్లతో పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. 18 రకాల అర్హత కలిగిన హస్త కళాకారులకు అండగా నిలుస్తూ, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. విశ్వకర్మ యోజన ను సి ఎస్ సి (కామన్ సర్వీస్ సెంటర్) లో దరఖాస్తు చేసిన తరువాత 15 రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి 7500 స్టైఫండ్ తో పాటు ధ్రువీకరణ పత్రం ఇస్తారని చెప్పారు. బ్యాంకుల ద్వారా 5%వడ్డీ తొ యాబై వేల నుండి 3 లక్షల వరకు ఋణం ఇస్తారని పేర్కొన్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ ధరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఒక సాదాసిదా మనిషి శ్రమిస్తే దేశాన్ని పరిపాలించవచ్చని, మోడీ నిరూపించారన్నారు. జీ20 సమావేశాలు సమర్థవంతంగా నిర్వహణ, చంద్రాయన్ 3 ద్వారా చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు, ఐఫోన్ 15 మేడ్ ఇన్ ఆయుస్మాన్ భారత్ లాంటి అనేక కార్యక్రమాలతో దేశాభివృద్ధికి మోడీ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ కే. రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు పి. సుస్మా, నాయకులు, దొంతు సుమన్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ప్రసాద్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మునగల చంద్ర ,మహేష్, చరణ్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.