రేణిగుంట
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి శనివారం శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే నిదర్శనమని తెదేపా రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ భాష ఆదివారం ఒక ప్రకటనలు తెలిపారు. ప్రజల్లో ధైర్యం నింపడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి తమ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రుషిత రెడ్డి చేపట్టిన ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమానికి విశేష స్పందన రావడం చూసి అధికార పార్టీ వారికి మతిపోయింది అన్నారు. దీంతో శనివారం ప్రచారం నిర్వహిస్తున్నారు రిషితా రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకొని భయభ్రాంతులకు గురిచేయలని వైకాపాకు చెందిన కొందరు అల్లరి ముఖ నాయకులు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. మహిళలు అందరూ ఇలా ప్రచారం నిర్వహిస్తుంటే వారిపైకి దాడికి యత్నించడం ఎంతవరకు సబవని, ఇదే నా రాష్ట్రంలో అమలవుతున్న మహిళల రక్షణ అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తద్యముని, ఇప్పటి నుంచే వైకాపా వారికి ఓటమి భయం పట్టుకుందని ఆయన తెలిపారు. వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు రాష్ట్ర ప్రజలు మహిళలు ఎప్పుడెప్పుడా అని కాసుకొని ఉన్నారని ఆయన పేర్కొన్నారు