Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుమరోసారి జగనన్నను గెలిపించుకుందాం-ఎన్నికల ప్రచారంలో బి.ఎస్ దిల్షాద్ పర్వీన్ మక్బూల్

మరోసారి జగనన్నను గెలిపించుకుందాం-ఎన్నికల ప్రచారంలో బి.ఎస్ దిల్షాద్ పర్వీన్ మక్బూల్

కదిరి:రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కొత్త చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించడంతో పాటు సీఎం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని బి.ఎస్ దిల్షాద్ పర్వీన్ మక్బూల్ పేర్కొన్నారు. మంగళవారం కదిరి మున్సిపల్ పరిధిలోని 6, 24వ వార్డులలో ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి గడపను సందర్శించిన ఆమె మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. “రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెమ్మలను సొంత కుటుంబ సభ్యులు లాగా భావించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగనన్నను మరోసారి అదిరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలు ఆర్థికంగా బలపడటానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాల ద్వారా ప్రతి పేద మహిళకు లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం జగనన్నను దక్కుతుంది. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలన్న ఆశయంతో అమ్మబడి, విద్యా దీవెన, వసతి దీవన వంటి పథకాలు అమలు చేస్తూ నేరుగా తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసిన జగనన్నే మళ్ళీ రావాలి. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని కాపుల ఆర్థిక స్వావలంబన కోసం ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుంది. సొంత ఇంటి కల నెరవేర్చడానికి రాష్ట్రంలోని ప్రతి పేద మహిళ పేరు మీద ఇంటిపట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసిన జగనన్నతో పాటు కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.ఎస్ మక్బూల్ కి ఓటు వేసి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం” అని పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు 28వ వార్డులోని మారుతి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పరికి నజీమున్నీసా, వైస్ చైర్ పర్సన్ కొమ్ము గంగాదేవి, కౌన్సిలర్లు రాంప్రసాద్, షాహిన్, కో ఆప్షన్ మెంబర్ బాబా ఫక్రుద్దీన్, వైఎస్ఆర్సిపి నాయకులు దుర్గం బాబ్జాన్, సనావుల్లా, షమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జీలాన్, కౌన్సిలర్లు కిన్నెరా కళ్యాణ్, బండారు మురళీ, జగన్ యాదవ్, బొబ్బలి రవి, ఓం ప్రకాష్, వలీ, ఖాసీం, కే. షబ్బీర్, కుటగుల్లా సలీమ్ , శివారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నాగిరెడ్డిపల్లి సంజయ్, అహ్మద్, బాబ్జాన్, వంశీ, రమణ నాయక్, కుమార్, మొగల్ మొహబూబ్ బేగ్, బాబు నాయక్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article