Sunday, May 4, 2025

Creating liberating content

సినిమామన సినీమా..య..!

మన సినీమా..య..!

కండలు తిరిగిన హీరో..
అండర్ వేర్ తో ఎక్స్ పోజింగ్..
తొడలు చూపిస్తూ నాయిక..
టూ పీస్ తో సెక్స్ పోజింగ్..!

++++++++++++++++++

పిసినారి సుబ్బయ్య
సినిమా తీద్దామని వెళ్ళి
పోయి పోయి రాజమౌళి
చేతిలో పడ్డాడు..!

++++++++++++++++++++

మంచి ధ్రిల్లర్ సినిమా తీద్దామని అనుకుంటున్నా..
అన్నాడు కొత్త దర్శకుడు..
వెళ్లి ఇంగ్లీష్ సినిమా
సిడిలు తెచ్చుకో..
సలహా ఇచ్చాడు
అనుభవశాలి
త్రివిక్రమ్ మౌళి..!

++++++++++++++++++++

ఆ సినిమా నిండా హింసే..
ఫ్యాక్షన్ మూవీ కదా..
ఇదిగో ఈ సీరియల్ నిండా
ఆడాళ్ళ కుట్రలే..
లేడీస్ ఓరియంటెడ్ మరి..!

++++++++++++++++++++

మంచి ముహూర్తమని
గుమ్మడి కాయ కొట్టి
షూటింగ్ మొదలెడితే..
హీరో తుమ్మాడు…
హీరోయిన్ గౌన్ లేచిపోయింది..
ఇంకేం మొదటి సీన్ పండింది..!

++++++++++++++++++++

ఐనాక్స్ లో సినిమాకెళ్తే
నెల ఖర్చు మింగేసే టికెట్..
ఇంటర్వెల్లో క్యాంటీన్ కు పోతే
బియ్యం బస్తా ఖరీదంత
పాప్ కార్న్ బకెట్..!

++++++++++++++++++++

సినిమా మొత్తం హీరోతో
తన్నులు తిన్న విలన్
చివరాఖరికి బతికేస్తున్నాడు..
సీక్వెల్ కి
సిద్ధం కావాలి కదా మరి..!

++++++++++++++++++++

పూర్వం రోజుల్లో
డబుల్ మీనింగ్
డైలాగులు ఉండేవి..
ఇప్పుడా బాధ లేదు..
అంతా సింగిల్ మీనింగే..!
సెన్స్ ఉందా సెన్సార్ కి..?
(నాని హిట్ 3 చూడండి..
పిల్లలు..ఆడాళ్ళ చెవుల్లో
దూదులు పెట్టండి..ప్లీజ్)

✍️✍️✍️✍️✍️✍️✍️✍️

సురేష్..9948545286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article