పరివర్తన కార్యక్రమం ద్వారా సమన్వయ సమావేశం మరియు అవగాహన కార్యక్రమం
జాతీయ మత్తు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ

వి.ఆర్.పురం :మత్తు మాదక ద్రవ్యాలకు నేటి యువత, విద్యార్థులు దూరంగా ఉండాలనీ, స్థానిక ఎస్ఐ నాగరాజు అన్నారు. జాతీయ మత్తు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, పరివర్తన అనే కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రం వి ఆర్ పురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే పోలీసుల ఆద్వర్యంలో బుధవారం భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధి సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాలతో యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, మత్తు మాదక ద్రవ్యాల వినియోగంపై వాటి నివారణకు వాటి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ విఆర్ పురం ఎస్సై కే నాగరాజు విద్యార్థులకు వివరించారు. ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనదనీ, ధూమపానం మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నల్లమందు, మార్ఫిన్, వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారనీ. ఒకసారి దీనికి బానిసలైతే తమభావి బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచేసుకోవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ పురం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు, విఆర్ పురం పోలీస్ శాఖ ఏఎస్ఐ రాధాకృష్ణ, పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

