కదిరి:రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మలు అఖండ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ శనివారం మండల పరిధిలోని శ్రీ పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా మండల జడ్పిటిసి అనిత విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు 501 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మలు అఖండ మెజారిటీతో గెలవడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీ సభ్యుల ఆమోదంతో రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు వారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో బి.ఎస్ మక్బూల్ అఖండ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఈనెల 4న వెలువడే ఫలితాలలో అత్యధిక మెజారిటీతో నియోజకవర్గంలో ముచ్చటగా మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు, మరింత మంచి చేసే శక్తిని కాబోయే ఎమ్మెల్యే మక్బూల్ తో పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రసాదించాలని ఆంజనేయస్వామిని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు మైనుద్దీన్, రాష్ట్ర పాలఏకరి డైరెక్టర్ దశరథరామయ్య నాయుడు, జే సి ఎస్ మండల కన్వీనర్ సమీవుల్లా, జిల్లా అగ్రి చైర్మన్ ముస్తఫా, రైతు సంఘం నాయకులు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు రమణారెడ్డి, యూసుఫ్, హైటెక్ రమణ, విష్ణువర్ధన్ రెడ్డి, పంచరత్నమ్మ ఉతన్న, ఎంపీటీసీలు రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, రామంజి, సీనియర్ నాయకులు కల్లిపల్లి శ్రీనివాసులు, మౌలా, నజీర్ కరీం, హనుమంతు రెడ్డి, బావాఖన్, లక్ష్మిపతి యాదవ్, మాజీ సర్పంచ్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.