Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమంత్రి దాడిశెట్టి ఇలాకాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ… యనమల సమక్షంలో తెలుగుదేశం లోకి చేరిన వైసీపీ...

మంత్రి దాడిశెట్టి ఇలాకాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ… యనమల సమక్షంలో తెలుగుదేశం లోకి చేరిన వైసీపీ నేతలు

తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తుంది.రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య గెలుపే లక్ష్యంగా వడి వడి అడుగులు వేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసైనికులు కలిసొచ్చే వారిని కలుపుకుంటూ విజయ బాటలు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వగృహ ప్రవేశాలకు ద్వారాలు తెరిచిన తెలుగుదేశం పార్టీ ‌ ఆపరేషన్ ఆకర్ష పేరుతో పాత మిత్రులను కొత్తవారిని కలుపుకొంటున్నారు ఇందులో భాగంగా మంత్రి దాడిశెట్టి రాజా సొంతూరులో వైకాపా గట్టి షాకే తగిలింది.తుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి వీరబాబు, పోలిశెట్టి రామలింగేశ్వర రావు, పోలిశెట్టి సత్తిబాబు, పోలిశెట్టి దారబాబు, పోలిశెట్టి మార్కండేయులు, పోలిశెట్టి అనిల్, పోలిశెట్టి శేఖర్, చల్లపల్లి శ్రీను, జవ్వాదుల‌ శ్రీను, కుర్ర కోటి, కుర్ర మణికంఠ, ఆకుల మనోహర్, నరిసే శ్రీను, నరిసే రాజా, జవ్వాదుల రాజా, నరిసే సత్తిబాబు, నరికే తాసు, కర్రీ బాబు, లక్ష్మీ శెట్టి సాంబ, శివ తదితరులతోపాటు 150 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి యనమల సోదరులు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article