మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కు ఎక్స్ వేదికగా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషిచేయాలని చెప్పారు.
అప్పగించిన బాధ్యతను లోకేష్ సమర్థంగా నిర్వహిస్తాడనే నమ్మకం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు మంత్రి నారా లోకేశ్ కృషి చేయాలని ఆయన తల్లి నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజా సేవ చేస్తూనే ఏపీని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
ఇదే నిబద్ధత భవిష్యత్‌లోనూ కొనసాగాలి : గతంలో మహిళలు న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని నారా భువనేశ్వరి అన్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంలో ఆ పరిస్థితి మారిపోయిందని తెలిపారు. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనితకు, పోలీస్ సిబ్బందికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మహిళల భద్రతపై ఇదే నిబద్ధత భవిష్యత్‌లోనూ కొనసాగాలని నారా భువనేశ్వరి కోరారు.