ఏలేశ్వరం:-
మండల ఎంపీడీవోగా వి.అరుణ బుధవారం పదవిబాధ్యతలుచేపట్టారు. ఇప్పటి వరకు ఎంపీడీవో గా పనిచేసిన ఎం. ప్రేమ్ సాగర్ రౌతులపూడి మండల పరిషత్ కార్యాలయానికి ఎంపీడీవోగా బదిలీపై వెళ్లారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వి.అరుణ కాకినాడ జిల్లా పరిషత్ నుండి తిరిగి ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉన్న సమస్యలపై నాయకులు తోట సిబ్బంది సహాయ సహకారాలతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని మండలంలోని పలు గ్రామాలకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఆమెను మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి), సిబ్బంది నూతన ఎంపీడీవోను అభినందించారు.