పోరుమామిళ్ల:
జిల్లా ఆర్యవైశ్య సంఘము మరియు పోరుమామిళ్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన శాశ్వత గౌరవాధ్యక్షులు గుబ్బ చంద్రశేఖర్ సూచన మేరకు మండల ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు తులసి సుధాకర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాజుల పల్లె శ్రీనివాసులు మరియు మాలెపాటి సత్యనారాయణ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో పోరుమామిళ్ల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కొప్పరపు గురు ప్రసాద్ ను ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కొప్పరపు గురుప్రసాద్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ భాద్యతను శ్రద్ధ తో నిర్వహిస్తానని, ఆర్య వైశ్యులందరి సహకారంతో సంఘాన్ని బలోపేతం చేస్తానని, పేద ఆర్య వైస్యులందరిన ఆదుకుంటానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని ఆర్యవైశ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.