Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుభాష్యం ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ లో జగ్గంపేట విద్యార్థుల హవా

భాష్యం ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ లో జగ్గంపేట విద్యార్థుల హవా

జగ్గంపేట
కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో శనివారం, ఆదివారం జరిగిన భాష్యం ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ మీట్లో జగ్గంపేట భాష్యం విద్యార్థులు సత్తా చాటారని ప్రిన్సిపాల్ కుసిరెడ్డి సత్యనారాయణ తెలియజేశారు. శనివారం జరిగిన బాలుర విభాగానికి రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి గారు.జిల్లా పిఈటి ప్రెసిడెంట్ జార్జి గారు హాజరయ్యారు.బాలుర జూనియర్ వాలీబాల్ విభాగంలో ప్రథమ స్థానంలోనూ, కోకో విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు.అలాగే ఆదివారం జరిగిన బాలికల భాగంలో విభాగంలో సీనియర్ మరియు జూనియర్ కబడ్డీలో ప్రథమ స్థానంలోనూ, జూనియర్స్ విభాగంలో క్యారంలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఆంధ్ర పాలిటెక్నిక్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ సత్తి రాజు గారు హాజరై విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇంచార్జ్ గోవిందరాజులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, జగ్గంపేట పీఈటి రవినాగ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article